అక్షరటుడే వెబ్‌డెస్క్: Multi Visceral Transplant | హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) వైద్యులు సరికొత్త చరిత్ర సృష్టించారు. దేశంలోనే అత్యంత సంక్లిష్టమైన ‘మల్టీ-విసెరల్’ (ఐదు అవయవాల) మార్పిడి శస్త్రచికిత్సను ఒకేసారి విజయవంతంగా పూర్తి చేసి, వైద్య రంగంలో తమ ప్రతిభను చాటుకున్నారు.
Multi Visceral Transplant | భారీ సవాలు..
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 30 సంవత్సరాల యువ ఇంజినీర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా, ఉస్మానియా వైద్య నిపుణుల బృందం ఈ భారీ సవాలును స్వీకరించింది. నిరంతరాయంగా 36 గంటల పాటు శ్రమించి, రోగికి ఒకేసారి కడుపు, డ్యూడినమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు , పెద్దపేగు భాగాలను మార్పిడి చేశారు. ఇటువంటి క్లిష్టమైన శస్త్రచికిత్స ప్రభుత్వ ఆసుపత్రిలో జరగడం వైద్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.

Multi Visceral Transplant | మంత్రి ప్రశంసలు..
ఈ చారిత్రాత్మక విజయంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగం ప్రపంచ స్థాయికి ఎదిగిందని ఆయన కొనియాడారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుతున్నాయని, ఈ విజయంలో భాగస్వాములైన సర్జన్లు, అనస్థీషియా బృందం, నర్సింగ్ , క్రిటికల్ కేర్ సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. పేదలకు అత్యున్నత స్థాయి వైద్య సేవలు ఉచితంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, రాబోయే రోజుల్లో ప్రభుత్వ వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
🇮🇳 A Historic Milestone in Indian Healthcare!
Doctors at Osmania General Hospital, Hyderabad have successfully performed India’s first Multi-Visceral Transplant, transplanting five organs—the stomach, duodenum, pancreas, small intestine, and right colon—in a single patient.
The… pic.twitter.com/pheIX4zL1H
— Office of Minister for Health, Telangana (@TelanganaHealth) July 1, 2026
ఇది కూడా చదవండి: Andhra Pradesh | ఏపీని గంజాయి హబ్‌గా మార్చారు : సీఎం చంద్రబాబు