అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Andhra Pradesh | గత ఐదేళ్లలో ఏపీ గంజాయి హబ్‌గా మారిందని, విద్వేషాలు పెరిగాయని సీఎం చంద్రబాబు (CM Chandrababu) విమర్శించారు. రాజధాని అమరావతి (Amaravati) అభివృద్ధిని కొందరు అడ్డుకున్నారని ఆరోపించారు.
నెల్లూరులో బుధవారం సీఎం మాట్లాడారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో వెంటనే సిట్ వేశామని తెలిపారు. రౌడీలు పోలీసులను ఛాలెంజ్ చేస్తే వాళ్లకు రోషం వస్తుందన్నారు. సాయికృష్ణ మిస్సింగ్‌పై కుల ముద్ర వేశారని, పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేశారని ఆగ్రమం వ్యక్తం చేశారు. పవన్ కూతురిపైనా అసభ్యకర పోస్టులు పెట్టారన్నారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్‌లకు సపోర్ట్ చేస్తారా అని ప్రశ్నించారు.
Andhra Pradesh | కోపం లేదు
తనను జైలులో పెట్టినందుకు కోపం లేదని చంద్రబాబు పేర్కొన్నారు. తాను జైల్లో పెట్టాలనుకుంటే నిమిషం చాలన్నారు. బ్లేడ్ బ్యాచ్‌లు, రౌడీలకు వైసీపీ మద్దతిస్తోందని ఆరోపించారు. సైకోను చూసుకునే వైసీపీ నేతల ఆగడాలు పెరిగాయన్నారు. హోంమంత్రిపై కూడా మేకప్ అంటూ కామెంట్స్ చేశారని, ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. తాను బటన్ నొక్కే సీఎంను కాదని, ప్రజల్లో ఉండే వ్యక్తినని చంద్రబాబు తెలిపారు.
నన్ను జైల్లో పెట్టాడు కదా అని కక్ష సాధింపుకు దిగితే.. అతన్ని జైల్లో పెట్టడం నాకు ఎంత పని.. నాకో లెక్కా – సీఎం చంద్రబాబు pic.twitter.com/9b4I8myLHd
— RTV (@RTVnewsnetwork) July 1, 2026
దీనిని కూడా చదవండి : Raghav Chadha Petition | రాఘవ్ చద్దా కేసులో హైకోర్టు కీలక నిర్ణయం