Chandrababu Drinks Toddy | తాటి కల్లు తాగిన ఏపీ సీఎం చంద్రబాబు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Chandrababu Drinks Toddy | ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన లైఫ్ స్టైల్ అందరికీ ఆదర్శం. నిత్యం ఆయన తీసుకునే భోజనం అలవాట్లను ఎన్నోసార్లు పలు వేదికలపై పంచుకుని అందరినీ ఆలోచింపజేశారు. కాగా.. సీఎం చంద్రబాబు తాజాగా తాటి కల్లు తాగారు. అవును మీరు వింటున్నది నిజమే ఆయన స్వయంగా తాటి ఆకులో కల్లు తాగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Chandrababu Drinks Toddy

సీఎం చంద్రబాబు సోమవారం కాకినాడ జిల్లా (Kakinada District)లో పర్యటించారు. చామవరం గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన కాన్వాయ్​లో వెళ్తూ ఓ గీత కార్మికుడిని చూసి ఆగారు. సింహాచలం అనే గీత కార్మికుడి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని సైతం పక్కనపెట్టి ఒక సామాన్యుడిలా చంద్రబాబు ఓ పూరిగుడిసెకు వెళ్లి, ఏకంగా తాటి చెట్టు దగ్గర నిలబడి డొప్పలో కల్లు తాగారు.

Chandrababu Drinks Toddy | ఆరోగ్యానికి మేలు

Chandrababu Drinks Toddy

ఇక తాటి కల్లు గురించి తెలుగు ప్రజలు ముఖ్యంగా తెలంగాణ వాసులకు చెప్పనక్కర్లేదు. నిత్యం లిమిట్గా తాటి కల్లు తీసుకునే వారికి క్యాన్సర్ లాంటి రోగాలు దరిచేరవని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇక తెలంగాణలో దొరికే తాటి కల్లుకి ప్రత్యేకతలు ఉన్నాయి. స్వచ్ఛమైన తాటి, ఈత కల్లుతో ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఉదయాన్ని నీరా తాగితే ఎంతో మేలు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తాటి, ఈత కల్లును ప్రోత్సహిస్తోంది.

ఇది కూడా చదవండి..: NTR Bharosa Pensions | జూన్ 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ.. రూ.2,728 కోట్లు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *