AP Municipal Elections | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. పులివెందులలో ఉద్రిక్తత

పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో హై టెన్షన్ నెలకొంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AP Municipal Elections | ఆంధ్ర ప్రదేశ్​ మున్సిపల్ ఎన్నికల్లో పలు చోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి స్వగ్రామం పులివెందుల మున్సిపాలిటీలో రాళ్లదాడి ఘటనలు చోటుచేసుకున్నాయి.

పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో హై టెన్షన్ నెలకొంది. వైసీపీ అభ్యర్థి వైఎస్ ప్రమీలపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. 21వ వార్డు పోలింగ్ కేంద్రంలోకి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 11, 12 పోలింగ్ కేంద్రాల దగ్గర రాళ్ల దాడి జరిగింది. మరోవైపు 1, 2 వార్డుల్లో ఓటు వేయనివ్వడం లేదని మహిళలు ఆందోళన చేనపట్టారు. పులివెందులలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల ప్రత్యర్థి వర్గాల మధ్య రాళ్ల దాడి జరగడంతో, పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అప్రమత్తం అయి నిరసనకారులను చెదరగొట్టారు. పులివెందులలో సుమారు 1,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు

AP Municipal Elections | మదనపల్లెలో..

ఏపీలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో సహా మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్​ ప్రక్రియ ప్రారంభం అయింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సైతం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ బూత్‌లోకి తమ ఏజెంట్లను అనుమతించడంలేదని వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి వెంకటచలపతి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు.

 

దీనిని కూడా చదవండి : LPG Price Hike | మరోసారి పెరిగిన కమర్షియల్​ గ్యాస్​ సిలిండర్​ ధరలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *