అక్షరటుడే వెబ్‌డెస్క్ : Nara Lokesh Durga | ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) శనివారం విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆలయ పాలకమండలి సభ్యులు ఘనస్వాగతం పలికారు.
Nara Lokesh Durga | అమ్మవారి ప్రత్యేక పూజలు..
కనకదుర్గమ్మను దర్శించుకున్న లోకేష్, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదల ప్రకారం మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అధికారులు, దర్శన అనంతరం వేద పండితులచే ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను బహూకరించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం ..
రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో అగ్రగామిగా నిలవాలని కోరుకుంటూ ఈ పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో శీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Bird Flu in Maharashtra | మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి.. వేల కోళ్లను పూడ్చేసిన అధికారులు..

