Oman Ship Attack | ఒమన్ తీరంలో నౌకపై అమెరికా దాడి: విశాఖకు చెందిన మెరైన్ చీఫ్ ఇంజినీర్ దుర్మరణం

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Oman Ship Attack | ఒమన్ తీర ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు మరణించినట్లు సమాచారం. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన మెరైన్ చీఫ్ ఇంజినీర్ సురేష్ పట్నాల ఉన్నట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.

ఈ ఘటనపై ఢిల్లీలోని ఆంధ్రాభవన్ అధికారులు కూడా సురేష్ పట్నాల మృతిని నిర్ధారించినట్లు తెలిసింది. సముద్ర రవాణా రంగంలో సేవలందిస్తున్న సురేష్ పట్నాల విధి నిర్వహణలో భాగంగా ఆ నౌకలో పనిచేస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

Oman Ship Attack | శోకచ్ఛాయలు

సురేష్ పట్నాలకు భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్వస్థలమైన విశాఖపట్నంలోనూ శోకచ్ఛాయలు అలుముకున్నాయి.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కోరుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ విషాద ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Hyderabad Metro Phase 2 | ప్రధాని మోడీతో సీఎం రేవంత్ కీలక భేటీ!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *