TTD Board Decisions | వీఐపీ సిఫారసు లేఖలు రద్దు.. టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: TTD Board Decisions | టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. సామాన్య భక్తులకు త్వరగా దర్శనం కల్పించేందుకు జూలై 15 వరకు వీఐపీ సిఫారసు లేఖలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల అభివృద్ధికి కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపింది.

టీటీడీ ఛైర్మన్​ అధ్యక్షతన పాలకమండలి సమావేశం నిర్వహించారు. తిరుమల ఆళ్వార్ ట్యాంక్ అతిథి గృహం స‌ర్కిల్ నుంచి బాట గంగ‌మ్మ స‌ర్కిల్ (Gangamma Circle) వ‌ర‌కు ఉన్న స‌ర్వ‌ద‌ర్శ‌నం క్యూలైన్ల‌లో రూ.4.55 కోట్ల‌తో అద‌న‌పు మ‌రుగుదొడ్లు నిర్మించేందుకు ఆమోదం తెలిపారు. విద్యా క‌మిటీ ఇచ్చిన నివేదిక మేర‌కు టీటీడీ విద్యా సంస్థ‌ల‌లో అత్యాధునిక వసతుల ఏర్పాటుకు అదనంగా రూ.43.40 కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపారు.

TTD Board Decisions | పట్టు వస్త్రాల కొనుగోలుకు..

తిరుమ‌ల‌ (Tirumala)లో నీటి వృథాను అరిక‌ట్టేందుకు, పెరుగుతున్న నీటి అవ‌స‌రాల దృష్ట్యా గోగ‌ర్భం డ్యామ్ నుంచి ఫిల్ట‌ర్ ప్లాంట్ వ‌ర‌కు రూ.6 కోట్ల‌తో దాదాపు 2 కిలో మీట‌ర్ల‌ మేర అద‌న‌పు పైపులైన్ ఏర్పాటు చేయనున్నారు. టీటీడీ అవ‌స‌రాల నిమిత్తం రూ. 44.20 కోట్లతో ఏపీకి చెందిన ఆప్కో, త‌మిళ‌నాడుకు చెందిన కో-ఆప్టెక్స్ సంస్థ‌ల నుంచి ప‌ట్టు వ‌స్త్రాలు, దుప్పటాలు కొనుగోలు చేసేందుకు పాలకమండలలి ఆమోదం తెలిపింది.

TTD Board Decisions | అక్షర గోవిందం

స‌నాత‌న ధ‌ర్మాన్ని మ‌రింత వ్యాప్తి చేసేందుకు తలపెట్టిన “అక్షర గోవిందం” కార్యక్రమంలో పాల్గొనే చిన్న పిల్లలకు పంపిణీ చేసే కిట్‌ను ఉచితంగా అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. తిరుమ‌ల‌లోని వ‌రాహ‌స్వామి విశ్రాంతి భ‌వ‌నం–1లో రూ. 3.61 కోట్ల‌తో ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు ఆమోదం తెలిపారు. ఖ‌మ్మంలో తెలంగాణ ప్ర‌భుత్వం కేటాయించిన 20 ఎక‌రాల స్థ‌లాన్ని స్వాధీనం చేసుకుని ఆల‌యం నిర్మించాలని టీటీడీ (TTD) నిర్ణయించింది. టీటీడీలో ప‌ని చేసే కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంద‌రికీ శ్రీ‌వారి ద‌ర్శ‌నం, ల‌డ్డూ కార్డు జారీ చేయనున్నారు. ఉద్యోగుల‌కు హెల్త్ స్కీమ్​ పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు.

TTD Board Decisions | రద్దీ తగ్గించేందుకు

అలిపిరి టోల్ గేట్‌ వ‌ద్ద వాహ‌నాల ర‌ద్దీని త‌గ్గించేందుకు వినాయ‌క‌స్వామి ఆల‌య స‌మీపంలో రూ.4.25 కోట్ల‌తో బ‌స్సుల త‌నిఖీల కోసం శాశ్వ‌త షెల్ట‌ర్లు ఏర్పాటు చేయాల‌ని పాలక మండలి సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు ధూప, దీప, నైవేద్యాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.5 వేలను రూ.10 వేలకు పెంచేందుకు ఆమోదం తెలిపారు.

ఇది కూడా చదవండి..: Sri City AC Industry | శ్రీ సిటీలో ఏసీల పరిశ్రమకు శంకుస్థాపన

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *