Deer Rescue | ఎస్సారెస్పీ బ్యాక్​ వాటర్​ వద్ద జింకపిల్ల లభ్యం..

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Deer Rescue | ఎస్సారెస్పీ బ్యాక్​ వాటర్​ వద్ద జింకపిల్లను అటవీశాఖ అధికారులు (Forest Officers) స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం వివరాలు వెల్లడించారు.

Deer Rescue | కుక్కలు తరుముతుండగా..

ఫారెస్ట్​ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సారెస్పీ బ్యాక్​ వాటర్​ (SRSP Backwaters) ప్రాంతంలో బుధవారం ఉదయం ఒకచిన్న జింకపిల్లను కుక్కలు తరుముతుండగా అక్కడే ఉన్న సర్పంచ్ బట్టు సంజీవ్​ రాజ్​​, రైతులు స్పందించారు. వెంటనే జింకపిల్లను కుక్కల బారి నుంచి కాపాడారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించి అప్పగించారు. ఈ సందర్భంగా జింకపిల్లను కాపాడిన సర్పంచ్, రైతులను అటవీశాఖాధికారులు అభినందించారు. అనంతరం జింకపిల్లను సమీప రిజర్వ్ ఫారెస్ట్​ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.

ఇది కూడా చదవండి..: Nizamabad ROB Projects | ఫలించిన ఎంపీ అర్వింద్​ కృషి.. జిల్లాలో మరో రెండు ఆర్వోబీలకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *