KCR Consoles | పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్​

పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ ఆదివారం పరామర్శించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KCR Consoles | దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్​ఎస్ (BRS)​ అధినేత కేసీఆర్​ ఆదివారం పరామర్శించారు. ఈ సమయంలో ఆయన భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి (Peddi Sudarshan Reddy) ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి కేసీఆర్​ నల్లబెల్లిలోని పెద్ది నివాసానికి బయలు దేరారు. ఈ సమయంలో దారిపొడుగున బీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్​కు స్వాగతం పలికారు. అనంతరం ఆయన నల్లబెల్లి చేరుకున్నారు. పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శించి (KCR Consoles ), ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు ఆయనను చూడటానికి అక్కడకు తరలి వచ్చారు.

KCR Consoles | చెక్కులు అందజేత

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్​ రూ. 2.25 కోట్ల ఆర్థికసాయం అందించారు. ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం రూ. 2 కోట్లు, ఆయన తల్లి బాగోగుల కోసం రూ. 25 లక్షల చెక్‌ను అందించారు. అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఆయన వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, అనిల్ జాదవ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, యాదవరెడ్డి, శంభీపూర్ రాజు, శేరి సుభాష్ రెడ్డి, క్రాంతి కిరణ్ తదితరులు ఉన్నారు.

దీనిని కూడా చదవండి : Medico Priyanka Death | చికిత్స పొందుతూ మెడికో ప్రియాంక మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *