అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Medico Priyanka Death | రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి చెందింది. ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయినట్లు కిమ్స్ వైద్యులు నిర్దారించారు. రాజమండ్రిలో ఈనెల 3న మద్యం మత్తులో ప్రియాంకను నిందితులు కారుతో ఢీకొట్టిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి (Rajamandry)లో ఒక మాల్ బయట 28 ఏళ్ల వైద్య విద్యార్థినిని ప్రియాంకను కారుతో ఢీకొట్టారు. ఆ ఇద్దరు యువకులు షాపింగ్ కాంప్లెక్స్‌కు రాకముందు మద్యం సేవించి, ఆ తర్వాత భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనంతరం మద్యం మత్తులో కారును వేగంగా తీసుకెళ్లి ప్రియాంకను ఢీకొట్టారు. వాహనం ఆమె తలపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను చికిత్స కోసం రాజమండ్రిలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ తీసుకొచ్చారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ (KIMS)లో ఆమె చికిత్స అందిస్తున్న వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు.
Medico Priyanka Death | నిందితులను కాపాడే ప్రయత్నం
ప్రియాంక మృతిపై మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. ప్రియాంకను యాక్సిడెంట్ చేసిన తర్వాత 3 రోజుల పాటు నిందితులపై కేసు పెట్టకుండా పోలీసులు కాపాడే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మంత్రి అనితా ఎవరూ కూడా కనీసం ఫోన్ చేసి పరామర్శించలేదన్నారు. ట్రీట్మెంట్ ఖర్చులకు కనీసం ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేయలేదని విమర్శించారు. ప్రియాంకకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రాజమండ్రిలోని అన్ని విద్యాసంస్థలు బంద్‌లో పాల్గొనాలని ఆయన కోరారు.
దీనిని కూడా చదవండి : Shravan Maas Puja | శ్రావణ మాసంలో పరమశివుడిని ఇలా పూజిస్తే భోళాశంకరుడి కరుణాకటాక్షాలు మీపైనే!