అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Bike Accident | నగర శివారులోని కలెక్టరేట్ (Nizamabad Collectorate) సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Bike Accident | బైక్‌ను రిపేర్‌కు తీసుకెళ్తుండగా..
నిజామాబాద్ రూరల్ (Nizamabad Rural) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ గ్రామానికి చెందిన ఠాగూర్ తన బైక్ రిపేర్ కావడంతో మరో బైక్‌కు తాడు కట్టి బైపాస్కు తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలో కలెక్టరేట్ దాటిన తర్వాత రాంగ్ రూట్లో వచ్చిన మరో బైక్ ఠాగూర్ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ఠాగూర్‌కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. స్పందించిన 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని బాధితుడిని జీజీహెచ్‌కు(GGH Nizamabad) తరలించారు. రూరల్ పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఇండిగో బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే విమాన ప్రయాణం..!