Kamareddy Police Rescue | తక్షణ స్పందన.. తల్లీకొడుకుల ప్రాణాలు కాపాడిన కామారెడ్డి పోలీసులు

డయలర్ నుంచి మహిళ ఫొటోను తెప్పించుకుని ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ నర్సా రెడ్డి, హోంగార్డ్ తిరుపతి చాకచక్యంగా వ్యవహరించి కేవలం 5 నిమిషాల్లోనే వారిద్దరినీ గుర్తించి సురక్షితంగా రక్షించారు.

Naresh Chandan

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Police Rescue | కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై కుమారుడితో కలిసి ఆత్మహత్యకు యత్నించిన మహిళను కామారెడ్డి టౌన్ పోలీసులు నిమిషాల వ్యవధిలో కాపాడారు.

కామారెడ్డి పట్టణంలో శనివారం రాత్రి డయల్-100కు అందిన సమాచారం మేరకు మహిళ కుమారుడితో కలిసి స్థానిక రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.

Kamareddy Police Rescue | పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తం

మహిళ ఫొటోను తెప్పించుకుని ఘటనా స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ నర్సా రెడ్డి, హోంగార్డ్ తిరుపతి చాకచక్యంగా వ్యవహరించి కేవలం 5 నిమిషాల్లోనే వారిద్దరినీ గుర్తించి సురక్షితంగా రక్షించారు.

అనంతరం వారికి ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమయస్ఫూర్తితో స్పందించి ఇద్దరి ప్రాణాలు నిలబెట్టిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు కామారెడ్డి పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని ఎస్పీ పేర్కొన్నారు.

Khammam Attempted Rape Victim | ఖమ్మం అత్యాచారయత్నం బాధిత బాలికను పరామర్శించిన కవిత

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *