Kamareddy Police | సమయస్ఫూర్తితో నిండు ప్రాణం కాపాడిన పోలీసులు

Srinivas Kolluri

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Police | ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని దేవునిపల్లి, రామారెడ్డి (Ramareddy) పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు. డయల్ 112కు వచ్చిన సమాచారానికి తక్షణమే స్పందించి నిండు ప్రాణాన్ని కాపాడటంలో మానవత్వాన్ని చాటుకున్నారు.

రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామానికి చెందిన వ్యక్తి వ్యక్తిగత సమస్యలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నిస్తున్నట్లు డయల్ 112కు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే దేవునిపల్లి పోలీసు సిబ్బంది పీసీ రమేష్, హోంగార్డు భూపతి అప్రమత్తమయ్యారు. బాధితుడికి ఫోన్ చేసి నిరంతరం మాట్లాడుతూ ధైర్యం చెబుతూ సముదాయించారు. అదే సమయంలో రామారెడ్డి పెట్రోల్ కార్ ఏఎస్ఐ పండరి గౌడ్​తో సమన్వయం చేసుకుంటూ సాంకేతిక సమాచారం ఆధారంగా బాధితుడు ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు.

Kamareddy Police | కుటుంబ సభ్యులకు అప్పగింత

అడ్లూరు శివారులోని రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న బాధితుడి వద్దకు వెంటనే చేరుకుని ఆత్మహత్యాయత్నాన్ని విరమింపజేశారు. అనంతరం రామారెడ్డి పెట్రోల్ కార్ సిబ్బంది సహకారంతో బాధితుడిని సురక్షితంగా ఇంటికి చేర్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రాణాలు కాపాడిన సిబ్బంది సమయస్ఫూర్తిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra), కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ అభినందించారు.

దీనిని కూడా చదవండి :  Bodhan Police Crime Review | డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి: సీపీ సాయిచైతన్య

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *