Croma Festival of Dreams 2026 | క్రోమా ‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’ షురూ.. ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్‌పై భారీ డిస్కౌంట్లు

పండుగ సీజన్‌ను పురస్కరించుకుని టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రీటైలర్ ‘క్రోమా’ (Croma) తన వార్షిక పండుగ క్యాంపెయిన్ ‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’ను ప్రారంభించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Croma Festival of Dreams 2026 | పండుగ సీజన్‌ను పురస్కరించుకుని టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ( Electronics )  రీటైలర్ ‘క్రోమా’ (Croma) తన వార్షిక పండుగ క్యాంపెయిన్ ‘ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్’ను ప్రారంభించింది. ఎలక్ట్రానిక్స్ , గృహోపకరణాలపై భారీ ఆఫర్లను ప్రకటించిన ఈ సేల్ అక్టోబర్ 31, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు ఎంపిక చేసిన అప్లయన్సెస్‌పై ఫ్లాట్ 35% వరకు డిస్కౌంట్, రూ. 45,000 వరకు క్యాష్‌బ్యాక్, అలాగే రూ. 20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌లను పొందవచ్చు.

Croma Festival of Dreams 2026 | ప్రత్యేక ఆఫర్లు..

క్రోమాలో యాపిల్ ప్రియుల కోసం ప్రత్యేకమైన ఎక్స్ఛేంజ్ , బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అర్హత గల ఎక్స్ఛేంజ్ , క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ఐఫోన్ 17 రూ. 58,990, ఐఫోన్ 17 ప్రో రూ. 94,490, ఐఫోన్ 17 ప్రో మాక్స్ రూ. 1,07,990 ప్రారంభ ధరలతో లభిస్తాయి. అలాగే స్టూడెంట్/టీచర్ డిస్కౌంట్లు , బ్యాంక్ ఆఫర్లతో మ్యాక్‌బుక్ ఎయిర్ M5 రూ. 1,01,910 నుంచి, ఐప్యాడ్ 11వ జనరేషన్ రూ. 42,065 నుంచి ప్రారంభమవుతాయి.

Croma Festival of Dreams 2026 | హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ..

పండుగ వేళ ఇళ్లను సరికొత్తగా తీర్చిదిద్దేందుకు పెద్ద స్క్రీన్ టీవీలు, హోమ్ అప్లయన్సెస్ పై ఆకర్షణీయమైన ధరలు ఉన్నాయి. ఎల్జీ 55-ఇంచ్ ఏఐ నానో టీవీ రూ. 41,990 నుంచి, శామ్‌సంగ్ 65-ఇంచ్ 4K మినీ ఎల్ఈడీ టీవీ రూ. 76,990 నుంచి, సోనీ 75-ఇంచ్ బ్రావియా 2 4K టీవీ రూ. 1,19,900 నుంచి అందుబాటులో ఉన్నాయి. అలాగే 1.5-టన్ గొడ్రెజ్ ఇన్వర్టర్ ఏసీ రూ. 28,990 (లేదా నెలకు రూ. 2,416 ఈఎంఐ) నుంచి, ఎల్జీ వాషింగ్ మెషిన్ రూ. 21,790 నుంచి, రెఫ్రిజరేటర్ రూ. 35,491 నుంచి ప్రారంభమవుతాయి.

Croma Festival of Dreams 2026 | ఆడియో ఆఫర్లు..

హెచ్‌పీ విక్టస్ గేమింగ్ లాప్‌టాప్ రూ. 81,140 నుంచి లభిస్తుండగా, లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు కేవలం రూ. 1,599 నెలవారీ ఈఎంఐ నుంచి అందుబాటులో ఉన్నాయి. మార్షల్ బ్లూటూత్ స్పీకర్లపై 35% వరకు డిస్కౌంట్ ఉండగా, రూ. 2,000లకు పైగా కొనుగోలుపై క్రోమా 120డబ్ల్యూ సౌండ్‌బార్‌ను కేవలం రూ. 5,400లకే సొంతం చేసుకోవచ్చు.

Croma Festival of Dreams 2026 | అదనపు పొదుపు ప్రయోజనాలు..

ప్రముఖ క్రెడిట్/డెబిట్ కార్డులు , ఎన్‌ఎఫ్‌సీ భాగస్వాముల ద్వారా రూ. 45,000 వరకు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. పాత ఎలక్ట్రానిక్స్ మార్చుకోవడం ద్వారా రూ. 20,000 వరకు గ్యారెంటీడ్ ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. టైర్-2, టైర్-3 నగరాల్లోని ఎంపిక చేసిన స్టోర్లలో ప్రత్యేక ఉచిత కానుకలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లను సమీపంలోని క్రోమా స్టోర్‌లో లేదా croma.com , టాటా న్యూ యాప్ ద్వారా పొందవచ్చు.

ఇది కూడా చదవండి: Vangaveeti Radha | జనసేనలో చేరిన వంగవీటి రాధా

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *