అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Revanth Reddy Birthday | జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో (Nizamabad) రేవంత్రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు నగేష్రెడ్డి, డీసీసీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో కేట్ కట్ చేసి సంబరాలు జరిపారు.
Revanth Reddy Birthday | రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రాభివృద్ధి..
సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో వెళ్తోందని నగేష్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారని.. పట్టుదలతో పనిచేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేశారని అన్నారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన విధంగా ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తున్నారని అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, రైతులకు రైతు రుణమాఫీ చేశామని సన్నబడ్లకు బోనస్ అందిస్తున్నామని, నూతన రేషన్ కార్డులు అందించామని, రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తున్నామని, ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్య అందిస్తున్నామని, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని తెలిపారు.
Revanth Reddy Birthday | జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల..
ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వ్యవసాయ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల అందించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా వచ్చి కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించారని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రోత్సహించారని అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకు వెళ్తున్నారని రేవంత్ రెడ్డి గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని బొబ్బిలి రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో నుడా ఛైర్మన్ కేశ వేణు, డీసీసీబీ ఛైర్మన్ రమేష్ రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, గ్రంథాలయ ఛైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి, డీసీసీ కోశాధికారి భక్తవత్సలం, సీనియర్ నాయకులు రత్నాకర్, డీసీసీ ఉపాధ్యక్షుడు కౌడపు శరత్ కుమార్, జిల్లా ఎస్టీ అధ్యక్షులు యాదగిరి, సీనియర్ నాయకులు మీసాల సుధాకర్, ఫిషరీస్ శ్రీనివాస్, గంగారెడ్డి, రామార్తి గోపి, రాజేంద్ర ప్రసాద్, అన్వర్, మనోహర్, మఠం రేవతి, విజయపుల్ రెడ్డి, సకినాల శివ ప్రసాద్, చంద్రకళ, పోల ఉష, బంటు బలరాం, విజయ రాణి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: బంగాళాఖాతంలో మరో ముప్పు.. తెలుగు రాష్ట్రాలపై ప్రభావమెంత?