Rajnath Singh Diwali | సైనికులు సరిహద్దుల్లో ఉన్నారు కాబట్టే ప్రశాంతంగా దీపావళి: రాజ్‌నాథ్ సింగ్

దేశ భద్రత, సార్వభౌమాధికారం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Rajnath Singh Diwali | దేశ భద్రత, సార్వభౌమాధికారం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన భారత్ ( India) -చైనా సరిహద్దు సమీపంలో ఉన్న సిక్కింలోని షేరథాంగ్ వార్ మెమోరియల్వద్ద భారత సైనికులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వీర జవాన్లకు, వారి కుటుంబ సభ్యులకు ఆయన హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Rajnath Singh Diwali | ప్రతి ఇంటికీ భరోసా..

విపరీతమైన ఎత్తు, గడ్డకట్టే మైనస్ డిగ్రీల చలి ఉండే షేరథాంగ్ ప్రాంతంలో సైనికుల మధ్య నిలబడటం వల్ల ఒక ప్రత్యేకమైన శక్తీ, అనుభూతి కలుగుతాయని, వాటిని మాటల్లో వర్ణించలేమని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. వీర జవాన్ల ఉత్సాహం, ధైర్యసాహసాలే తనకు దీపావళి పండుగ  అసలైన కాంతి అని పేర్కొన్నారు. నిశ్శబ్దంగా చీకటితో పోరాడే దీపంలాగే, భారత సైనికులు సరిహద్దుల్లో విధి నిర్వహణ చేస్తూ దేశంలోని ప్రతి ఇంటికీ రక్షణను, భరోసాను అందిస్తున్నారని ప్రశంసించారు.

Rajnath Singh Diwali | యువతకు నిరంతర స్ఫూర్తి..

క్రమశిక్షణే మన సైన్యానికి అతిపెద్ద బలమని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వీర సైనికుల త్యాగాలు భారతీయ సమగ్రతకు, ఐక్యతకు పరాకాష్ట అని కొనియాడారు. షేరథాంగ్ వార్ మెమోరియల్ రాబోయే భవిష్యత్ తరాలకు, యువతకు నిరంతరం దేశభక్తి స్ఫూర్తిని నింపుతుందని చెప్పారు. సైనికుల కుటుంబాలంతా ఎల్లప్పుడూ సుఖసంతోషాలు, శ్రేయస్సుతో వర్ధిల్లాలని రాజ్‌నాథ్ సింగ్ ఆకాంక్షించారు.

ఇది కూడా చదవండి: ORR Accident | ఔటర్​ రింగ్​ రోడ్డుపై ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *