అక్షరటుడే వెబ్డెస్క్: Sonia Gandhi Voter List | కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి సంబంధించి ఓటర్ జాబితా వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. భారత పౌరసత్వం పొందకముందే ఆమె పేరు ఓటర్ల జాబితాలో చేర్చారన్న ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు నిరాకరిస్తూ మెజిస్ట్రేట్ కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఢిల్లీ ( Delhi )సెషన్స్ కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఈ పిటిషన్పై మరోసారి కొత్తగా విచారణ జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని దిగువ కోర్టును ఆదేశించింది.
Sonia Gandhi Voter List | కేసు నేపథ్యం..
సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందడానికి ముందే 1980 నాటి ఓటర్ల జాబితాలో ఆమె పేరు చేర్చారనే ఆరోపణలపై విచారణ జరపాలంటూ న్యాయవాది వికాస్ త్రిపాఠి గతంలో మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ను మెజిస్ట్రేట్ కోర్టు కొట్టివేయగా, దానిని సవాల్ చేస్తూ ఆయన సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.
Sonia Gandhi Voter List | సెషన్స్ కోర్టు వ్యాఖ్యలు..
ఈ పిటిషన్ను విచారించిన జడ్జి.. దిగువ కోర్టు ఉత్తర్వులలో చట్టపరమైన లోపాలు ఉన్నాయని స్పష్టం చేశారు. నిబంధనలను సరిగ్గా పాటించలేదని, పోలీసు అధికారుల నుంచి నివేదిక తీసుకోకుండా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాత ఉత్తర్వులను రద్దు చేస్తూ, ఫిర్యాదుపై అన్ని కోణాల్లోనూ పరిశీలన జరిపి చట్టబద్ధంగా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని మెజిస్ట్రేట్ కోర్టును ఆదేశించారు.
ఇది కూడా చదవండి: Bihar Girl Harassment | బీహార్లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై వేధింపులు.. రాహుల్ గాంధీ ఆగ్రహం