అక్షరటుడే వెబ్‌డెస్క్: Bihar Girl Harassment | బిహార్‌లోని జమూయ్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన అఘాయిత్యం వెలుగు చూసింది. ట్యూషన్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ బాలికను దుండగులు అడ్డగించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. జమూయ్ పట్టణంలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని శనివారం సాయంత్రం ట్యూషన్ ముగించుకుని మరో బాలుడితో కలిసి స్కూటర్‌పై ఇంటికి బయలుదేరింది. జమూయ్-లఖిసరాయ్ ప్రధాన రహదారిపై సాయంత్రం సుమారు 7 గంటల ప్రాంతంలో కొందరు యువకులు వారిని అడ్డుకున్నారు.
Bihar Girl Harassment | దారుణంగా వేధించడం ..
బాలికను భయపెడుతూ దారుణంగా వేధించడం ప్రారంభించారు. “ప్లీజ్.. వదిలేయండి” అని బాధితురాలు కన్నీళ్లతో వేడుకున్నా ఆ మృగాళ్ల మనసు కరగలేదు. పదేపదే బాలికపై చేతులు వేస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డారు. బాలుడి కాలర్ పట్టుకుని లాగుతూ, బాలికను బలవంతంగా దూరంగా లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బాలిక తప్పించుకోవడానికి యత్నించగా, ముఖానికి ముసుగు ధరించిన ఓ వ్యక్తి ఆమెను వెంబడించాడు. చివరకు బాలుడు వారి చెర నుంచి తప్పించుకుని బాలిక దగ్గరకు చేరుకుని అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, నిందితులు మళ్లీ వెంబడించారు. బాధితురాలు మరోసారి ప్రాధేయపడిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.
Bihar Girl Harassment | నిందితుల అరెస్ట్..
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన జమూయ్ పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. బాధితుల నుంచి వివరాలు సేకరించి, ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జమూయ్ ఎస్పీ విశ్వజిత్ దయాళ్ తెలిపారు.
Bihar Girl Harassment | రాహుల్ గాంధీ స్పందన..
ఈ ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. బహిరంగ రహదారిపై, సాయంత్రం 7 గంటల సమయంలోనూ ఓ బాలికకు రక్షణ లేకపోవడంపై బీహార్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోక్సో చట్టం కింద నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు ఈ ఘటనను మంత్రి సునీల్ కుమార్ తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలుంటాయని, ఎస్పీతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకుంటామని తెలిపారు. అయితే, ఒక్క ఘటన ఆధారంగా బీహార్‌ను ‘జంగిల్ రాజ్’గా చిత్రీకరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
📍Jamui, Bihar
A boy and girl, both reportedly Class 10 students, were returning from their coaching class. On their way back, a group of men stopped their scooter and started questioning them.
And when the two try to escape, the men chase them. A man grabs the girl, lifts… pic.twitter.com/Ome67VFI5m
— The Indian Idiot (@theindianidiot) September 21, 2026
ఇది కూడా చదవండి: ACB Raids Nzb Municipality | నిజామాబాద్ మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఇద్దరు సిబ్బంది