ACB Raids Nzb Municipality | నిజామాబాద్​ మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు.. రెడ్​హ్యాండెడ్​గా దొరికిన ఇద్దరు సిబ్బంది

నగరంలోని మున్సిపల్​ కార్పొరేషన్​లో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ సిటీ: ACB Raids Nzb Municipality | నగరం (Nizamabad)లోని మున్సిపల్​ కార్పొరేషన్​లో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. ఇద్దరు అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు.

కార్యాలయంలోని ఎస్లాబ్లిష్​మెంట్​ సెక్షన్​లో..

అకౌంట్స్​ సెక్షన్​లో ఓ అధికారి, ఒక ఔట్​సోర్సింగ్​ ఉద్యోగి ఒకరు డబ్బులు తీసుకుంటుండగా రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డారు. పక్కా సమాచారంతో ఏసీబీ దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా పోలీసులు కార్యాలయంలో రాకపోకలను స్తంభింపజేశారు. కార్యాలయంలోని ఎస్టాబ్లిష్​మెంట్​ సెక్షన్​ను మూసివేసి విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి..: Poshan Awareness Programs | పోషణకు అభయం.. అంగన్‌వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *