Rice Shortage | బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Rice Shortage | బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. కలెక్టరేట్​లో బుధవారం రైస్ మిల్లర్లు, ట్రేడర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

Rice Shortage | నియంత్రణకు సహకరించాలి..

బియ్యం ధరలను నియంత్రణలో ఉంచేందుకు రైస్ మిల్లర్లు, బియ్యం వ్యాపారులు, ట్రేడర్లు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ సూచించారు. బియ్యం నిల్వలు, సరఫరా, విక్రయాల విషయంలో పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించి బియ్యం ధరలను పెంచేందుకు ప్రయత్నించినా, అక్రమ నిల్వలకు పాల్పడినా సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల అతిక్రమణకు పాల్పడే ట్రేడర్ల లైసెన్సులు రద్దు చేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రజలకు నిత్యావసరమైన బియ్యం సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. మర్కెట్‌లో బియ్యం లభ్యత, ధరల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ బియ్యం క్రయ విక్రయాలలో ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Rice Shortage | అపోహలు రానివ్వొద్దు..

బియ్యం ధరలు, నిల్వలు, సరఫరాకు సంబంధించి ప్రజల్లో అనవసర ఆందోళన కలిగించే రీతిలో అపోహలు, వదంతులను వ్యాప్తి చేయవద్దని కలెక్టర్ కోరారు. వాస్తవ పరిస్థితులను నిర్ధారించుకోకుండా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడటంతో పాటు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించేందుకు వ్యాపారులు సహకరించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రేడర్లు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Transgender Awareness | ట్రాన్స్​జెండర్లు ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా, గౌరవప్రదంగా జీవించాలి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *