అక్షరటుడే, నందిపేట్: Velmal Father Suicide | కుమార్తె ప్రేమ వివాహం చేసుకుందని ఓ తండ్రి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన నందిపేట్ (nandipet) మండలంలోని వెల్మల్‌లో చోటుచేసుకుంది.
Velmal Father Suicide | పరువు పోయిందని..
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్మల్ గ్రామానికి చెందిన బండికాడి రాజన్న(50)కు రాజన్నకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లిచేసుకుంది. కుమార్తె తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని.. దీంతో తన పరువు పోయిందని భావించిన రాజన్న మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో తన పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని భార్య బండికాడి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.
ఇది కూడా చదవండి: బీజేపీ వాళ్లకి..రోడ్డుపై కూర్చోవడం అలవాటు