అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. నిత్యం ఏసీబీ (ACB) దాడులు చేపడుతున్నా.. భయం లేకుండా లంచాలు తీసుకుంటున్నారు. తాజాగా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ఏసీబీ వలకు చిక్కాడు.
యాదాద్రి భువనగిరి (Yadadri) జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ కె. వెంకటేశ్వర్లు ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫిర్యాదిదారుడి పెట్రోల్ బంక్‌కు సంబంధించిన వెరిఫికేషన్ సర్టిఫికేట్ జారీ చేసినందుకు, “డైలీ సేల్స్ రిజిస్టర్”ను అప్పగించినందుకు మెట్రాలజీ ఇన్స్పెక్టర్ పెట్రోల్ పంప్ టెక్నీషియన్ కాసారం రవీందర్ ద్వారా రూ.20 వేల లంచం డిమాండ్ చేశాడు.
ACB Raid | ప్రైవేట్ వ్యక్తి ద్వారా
ఈ మేరకు ప్రైవేట్ వ్యక్తి రవీందర్ ద్వారా బుధవారం లంచం తీసుకుంటుండగా.. నల్గొండ ఏసీబీ అధికారులు (ACB Raid) వల పన్ని పట్టుకున్నారు. రవీందర్ హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్లో ఫిర్యాదుదారుడి నుంచి రూ.20 వేలు తీసుకున్నాడు. అందులో రూ.15 వేలు మెట్రాలజీ ఇన్స్పెక్టర్కు, రూ.5 వేలు రవీందర్ పంచుకుంటారని అధికారులు తెలిపారు. ఈ మేరకు నగదు స్వాధీనం చేసుకొని, నిందితులపై కేసు నమోదు చేశారు. ఇద్దరని అరెస్ట్ చేశారు.
తెలంగాణలో లంచాలపై ఫిర్యాదుల వెల్లువ.. రోజుకు 20 కాల్స్!
తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు అడుగుతున్నారంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నట్లు సమాచారం. ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు రోజుకు సగటున 18 నుంచి 20 కాల్స్ వస్తుండగా, ఈమెయిల్స్, ప్రత్యక్ష ఫిర్యాదులతో కలిపి నెలకు 400కు పైగా ఫిర్యాదులు అందుతున్నట్లు పేర్కొంటున్నారు. ఫిర్యాదులపై ఏసీబీ అధికారులు సమాచారాన్ని గోప్యంగా ఉంచుతూ చర్యలు చేపడుతున్నట్లు కథనం వెల్లడిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచిస్తున్నారు.
#telanganaacb #acb1064 #anticorruption #bribery #telangana #publicawareness #aksharatoday
— Akshara Today | Telugu News (@AksharaToday) October 28, 2026
దీనిని కూడా చదవండి : Velmal Father Suicide | కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడంతో తండ్రి ఆత్మహత్య