అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SI Caught by ACB | హైదరాబాద్ (Hyderabad) నగరంలో మరో పోలీస్ అధికారి ఏసీబీకి చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఏసీబీ (ACB) అధికారులు కేసు నమోదు చేశారు.
నగరంలోని మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ సీఐ కొండల్రావు, హోంగార్డు అబిద్ అలీ మంగళవారం ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ కొట్టురు విజయ్‌కుమార్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆయన ఫిర్యాదిదారుడి నుండి మొదట రూ.10 లక్షల లంచం డిమాండ్ చేశారు. అనంతరం ఆ మొత్తాన్ని రూ.లక్షకు తగ్గించాడు.
SI Caught by ACB | అరెస్ట్ చేయకుండా ఉండటానికి..
ఓ కేసులో అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఎస్సై లంచం డిమాండ్ చేశాడు. అరెస్టు చేయకపోవడం, Cr.P.C. సెక్షన్ 41-A కింద నోటీసులు జారీ చేయడం, ఆ నోటీసులకు ఫిర్యాదిదారుడు సమర్పించిన సమాధానాలను అంగీకరించడం, ఆ విషయానికి సంబంధించి అతనిపై కొత్త కేసులు నమోదు కాకుండా చూసుకోవడం వంటి సాయం చేస్తానని డబ్బులు అడిగాడు. ఈ మేరకు బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఎస్సై విజయ్‌కుమార్‌పై అధికారులు కేసు నమోదు చేశారు. అతడిని అరెస్ట్ చేశారు.
దీనిని కూడా చదవండి : IAS Transfers | పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ