TGPSC Recruitment | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. 102 పోస్టులకు నోటిఫికేషన్

తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్ 102 ఏఎస్​వో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGPSC Recruitment | నిరుద్యోగులకు టీజీపీఎస్సీ గుడ్​ న్యూస్​ చెప్పింది. 102 స్టాటిస్టికల్​ ఆఫీసర్​, మండల ప్లానింగ్​ అధికారి పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్​ విడుదల చేసింది.

TGPSC Recruitment | ఈ నెల 30 నుంచి దరఖాస్తులు

మండల ప్లానింగ్​ అండ్​ స్టాటిస్టికల్​, అసిస్టెంట్​ స్టాటిస్టికల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థలు వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 30 నుంచి నవంబర్ 27 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 2027 జనవరిలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు వారం ముందు హాల్​ టికెట్లు విడుదల చేస్తామని కమిషన్​ తెలిపింది. అభ్యర్థులు తన రిజిస్టర్డ్ OTR నంబర్‌తో కమిషన్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. పరీక్షను ఓఎంర్​ లేదా సీబీటీ విధానంలో నిర్వహిస్తామనే దానిపై ఇంకా స్పష్టత లేదు. త్వరలో దీనిపై ప్రకటన చేస్తామని అధికారులు తెలిపారు.

దీనిని కూడా చదవండి : SI Caught by ACB | రూ.10 లక్షల లంచం డిమాండ్​.. ఏసీబీకి చిక్కిన ఎస్సై

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *