అక్షరటుడే వెబ్‌డెస్క్: Ramya Rao Allegations | కేసీఆర్ కుటుంబం పదేళ్ల పాలనలో రాష్ట్ర సంపదను అడ్డగోలుగా దోచుకుందని కేసీఆర్ అన్న కూతురు, కాంగ్రెస్ నాయకురాలు రమ్యరావు తీవ్ర ఆరోపణలు చేశారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావులను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనను చూసి ఓర్వలేకనే బీఆర్‌ఎస్ నేతలు 22-ఏ భూముల అంశాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
Ramya Rao Allegations | కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్
తమకు తాతల కాలం నాటి నుంచే వందల ఎకరాల భూమి ఉందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రమ్యరావు స్పందించారు. “కేటీఆర్.. నువ్వు, నేను ఇద్దరం రాఘవ రావు గారి పిల్లల పిల్లలమే. కేసీఆర్‌కు నేను సొంత అన్న బిడ్డను, కవిత ఇంటివారమే. మరి మాకు వందల ఎకరాలు ఉంటే మా భూమి ఎక్కడ ఉంది? మాకు సంబంధం లేని జోగినపల్లి సంతోష్ రావు కేసీఆర్ దగ్గర ఎందుకు ఉంటున్నాడు?” అని సూటిగా ప్రశ్నించారు. తమను ఇంటి నుంచి బయటకు పంపి, సంతోష్ రావుకు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని నిలదీశారు.
Ramya Rao Allegations | సంతోష్ రావు ఆస్తులపై ప్రశ్నలు..
సంతోష్ రావు బినామీల ద్వారా భారీగా ఆస్తులు సంపాదించారని రమ్యరావు ఆరోపించారు. గతంలో కరీంనగర్‌లో సింగిల్ బెడ్‌రూమ్ ఇల్లు, వేసుకోవడానికి చెప్పులు కూడా లేని సంతోష్ రావుకు ఇప్పుడు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు. ఇందులో భాగంగా సంతోష్ రావు భార్య రోహిణి పేరు మీద నానక్‌రామ్‌గూడలో రూ.21.40 కోట్ల విలువైన పెద్ద కమర్షియల్ బిల్డింగ్ ఎలా వచ్చిందని నిలదీశారు. అలాగే కొండాపూర్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఇళ్లు, మార్కుక్ గ్రామంలో 9 ఎకరాల భూమి ఎలా వచ్చాయని ఆరా తీశారు. 2013-15 మధ్య కుదురుపాక గ్రామంలో ఓసీ వర్గానికి చెందిన సంతోష్ రావు, ఆయన కుటుంబ సభ్యులు బీసీలుగా సర్టిఫికెట్లు తీసుకుని 8 ప్లాట్లు పొందారని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా ఆస్ట్రేలియాలో వెయ్యి ఎకరాలలో జేఎస్ రాజ్ ఎస్టేట్ ఉందని, వెన్నమనేని శ్రీనివాస్ రావు అనే బినామీ ద్వారా హవాలా రూపంలో ఆస్తులు దాచారని విమర్శించారు. ఫామ్‌హౌస్‌లలో డైమండ్స్, డాక్యుమెంట్లు కూడా దాచారని రమ్యరావు తీవ్ర ఆరోపణలు చేశారు.
Ramya Rao Allegations |కేటీఆర్‌కు నేరుగా సవాల్..
అక్కను, చెల్లిని రోడ్డున పడేసి సంతోష్ రావును ఎందుకు పక్కన పెట్టుకున్నావని కేటీఆర్‌ను రమ్యరావు నిలదీశారు. సంతోష్ రావు నీకు బినామీనా? ఎందుకు భయపడుతున్నావు? అని ప్రశ్నించారు. దుబాయి నుంచి సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై అడ్డగోలుగా ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఆస్తులన్నీ బయటకు తీయకముందే, వారే స్వచ్ఛందంగా బయటపెట్టి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, కేటీఆర్ ఈ విషయంలో వెంటనే స్పందించి సంతోష్ రావు ఆస్తులను ప్రజలకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
Arey Pettem @PettemINC jagratha raa…Harish Rao gurinchi maatladithe aa Ramya Rao e ninnu cheppu thisukoni kodthadi https://t.co/Jl29B2aVyF
— Krishna (@kukatpallyvaasi) September 21, 2026
ఇది కూడా చదవండి: ACB Raids Nzb Municipality | నిజామాబాద్ మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఇద్దరు సిబ్బంది