Defence Liquor Seizure | రూ.10 లక్షల విలువైన డిఫెన్స్ మద్యం పట్టివేత

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Defence Liquor Seizure | హైదరాబాద్​లో రూ.10 లక్షల విలువైన రక్షణ శాఖ ప్రీమియం మద్యం దొరికింది. బెంగళూరు, హర్యానాలోని రక్షణ శాఖ క్యాంటీన్ల నుంచి తీసుకువచ్చి, హైదరాబాద్‌ (Hyderabad)లోని ఉన్నత వర్గాల వినియోగదారులకు అక్రమంగా దీనిని విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. 361 ప్రీమియం మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి (Retired Army Employee) దొడ్ల సురేష్ రెడ్డి (48) రక్షణ శాఖ మార్గాల ద్వారా ఈ మద్యాన్ని సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈఎస్ జీవన్ కిరణ్, సీఐ సుభాష్ చందర్, ఎస్సై అఖిల్ నేతృత్వంలోని బృందం మంగళవారం తెల్లవారుజామున హస్తినాపురంలోని శ్రీరమణ కాలనీ ఫేజ్-IIలో ఒక ఇంటిపై దాడి చేసి ఈ మద్యాన్ని స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ.10 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. దాడికి ముందే నిందితుడు పారిపోయినట్లు సమాచారం. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

Defence Liquor Seizure | అక్రమంగా తరలింపు

దేశంలో ఆర్మీ క్యాంటిన్ల (Army canteens) ద్వారా డిఫెన్స్​ సిబ్బంది, ఆర్మీ కోసం మద్యం సరఫరా చేస్తుంటారు. దీనిని రక్షణ శాఖ సిబ్బంది మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. బయట మార్కెట్ల కంటే దీని రేటు క్యాంటీన్లలో తక్కువగా ఉంటుంది. అంతేగాకుండా ఆర్మీ మద్యానికి బయట డిమాండ్​ ఉంటుంది. దీంతో పలువురు ఆర్మీ ఉద్యోగులు అక్రమంగా ఈ మద్యాన్ని బయట మార్కెట్లలో విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పోలీసులు దాడి చేసి రూ.10 లక్షల విలువైన ఆర్మీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి..: Anasuya cyber harassment | నటి అనసూయ భరద్వాజ్‌పై సోషల్ మీడియాలో వేధింపులు.. నిందితుడి అరెస్టు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *