Stock Market Gains | లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Market Gains | అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి చర్చలు పునరుద్ధరించబడతాయన్న అంచనాలతో క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధర స్థిరంగా కదలాడుతోంది. దీంతో ఆసియా మార్కెట్లు పాజిటివ్‌గా సాగుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్‌లోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో బెంచ్ మార్క్ సూచీలైన నిఫ్టీ, సెన్సెక్స్ లాభాల బాటలో సాగుతున్నాయి.

Stock Market Gains | పైపైకి సూచీలు..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) మంగళవారం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 97, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ప్రారంభించాయి. మొదట్లో కొంత ఒడిదుడుకులకు లోనయినా తర్వాత కోలుకుని పైపైకి దూసుకువెళ్లాయి. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 698 పాయింట్ల లాభంతో 79,218 వద్ద, నిఫ్టీ 187 పాయింట్ల లాభంతో 24,552 వద్ద ఉన్నాయి.

Stock Market Gains

Stock Market Gains | రాణిస్తున్న అన్ని రంగాల షేర్లు..

దేశీయ స్టాక్ మార్కెట్ లో అన్ని రంగాల షేర్లు రాణిస్తున్నాయి. నిఫ్టీలో రియాలిటీ ఇండెక్స్ 2.99 శాతం, టెలికాం 1.55 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.22 శాతం, మీడియా 1.21 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.01 శాతం లాభంతో ఉన్నాయి.

Stock Market Gains | ఒక్కటి మినహా..

బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఒక స్టాక్ మినహా మిగిలిన 29 స్టాక్స్ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ట్రెంట్ 2.76 శాతం, ఆసియన్ పెయింట్ 2.27 శాతం, అదానీపోర్ట్స్ 1.85 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.82 శాతం హెచ్‌డీఎఫ్ సీ బ్యాంక్ 1.36 శాతం లాభాలతో ఉన్నాయి.
బీఈఎల్ 0.31 శాతం నష్టంతో కదలాడుతోంది.

ఇది కూడా చదవండి..: April 21 Gold rates | బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. అక్షయ తృతీయ కొనుగోళ్ల తర్వాత మార్కెట్‌లో ఊగిసలాట

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *