Windows 10 ESU | మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం.. విండోస్ 10కు మరో ఏడాది పొడిగింపు

విండోస్ 10 వాడుతున్న వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక మంచి వార్తను అందించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Windows 10 ESU | విండోస్ 10 వాడుతున్న వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ (Microsoft) సంస్థ ఒక మంచి వార్తను అందించింది. విండోస్ 10 కోసం ‘ఎక్స్టెండెడ్ సెక్యూరిటీ అప్‌డేట్స్’ (ESU) ప్రోగ్రామ్‌ను మరో సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల 2027 అక్టోబర్ వరకు విండోస్ 10 వినియోగదారులకు సెక్యూరిటీ అప్‌డేట్లు అందుబాటులో ఉండనున్నాయి.

Windows 10 ESU | ఎందుకీ నిర్ణయం?

చాలా మంది వినియోగదారులు విండోస్ 11కు మారలేక లేదా కొత్త పీసీని కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. వారిని దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ ఈ సదుపాయాన్ని పొడిగించింది. ఈ గడువు అక్టోబర్‌తో ముగియాల్సి ఉండగా, ఇప్పుడు దానికి అదనంగా మరో ఏడాది సమయం లభించింది. ఈ అప్‌డేట్లు పొందాలనుకునే వారు మైక్రోసాఫ్ట్ అందించే ‘ఎక్స్టెండెడ్ సెక్యూరిటీ అప్‌డేట్స్’ (ESU) ప్రోగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.

Windows 10 ESU | ఏమి లభిస్తాయి?:

ఈ ప్రోగ్రామ్ ద్వారా కేవలం కంప్యూటర్ భద్రతకు సంబంధించిన (సెక్యూరిటీ) అప్‌డేట్లు మాత్రమే వస్తాయి. విండోస్ 10 వాడే వారికి కొత్త ఫీచర్లు, డిజైన్ మార్పులు లేదా ఇతర నాన్-సెక్యూరిటీ అప్‌డేట్లు రావు. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్‌లో చేరిన యూజర్లు మళ్ళీ కొత్తగా చేయాల్సిన పని ఏమీ లేదు. మైక్రోసాఫ్ట్ తన వినియోగదారులను విండోస్ 11కు ప్రోత్సహిస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో విండోస్ 10లో కొనసాగుతున్న లక్షలాది మందికి ఈ పొడిగింపు ఎంతో ఉపశమనాన్ని కలిగించనుంది.

ఇది కూడా చదవండి..: June 28 Gold Prices | బంగారం, వెండి ధరలు మరింత దిగిరానున్నాయా..? బులియన్​ మార్కెట్​లో మ్యాజిక్​ జరగనుందా..?

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *