బిజినెస్​Stock Market Today | నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Stock Market Today | నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

జియో పొలిటికల్ టెన్షన్స్ పెరుగుతుండడంతో స్టాక్ మార్కెట్ ఒత్తిడికి గురవుతోంది. ఉదయం 11.35 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 600 పాయింట్లు, నిఫ్టీ 184 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Today | అమెరికా, ఇరాన్ ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. హార్మూజ్ జలసంధి (Strait of Hormuz)లోని నౌకలతోపాటు యÖఏఈపైనా ఇరాన్ దాడులకు పాల్పడుతుండడంతో పరిస్థితి దిగజారుతోంది.

రూపాయి మరింత పతనమవడం మన మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడంతో ప్రధాన సూచీలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.

Stock Market Today | నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) మంగళవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 166 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 37 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 512 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 67 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 20 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాల నుంచి 159 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11.35 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 600 పాయింట్ల నష్టంతో 76,668 వద్ద, నిఫ్టీ 184 పాయింట్ల నష్టంతో 23,934 వద్ద ఉన్నాయి.

Stock Market Today | మిక్స్ డ్ గా సూచీలు..

దేశీయ స్టాక్ మార్కెట్ లోని ఇండెక్స్‌లు మిక్స్ డ్‌గా సాగుతున్నాయి. నిఫ్టీ (Nifty)లో టెలికాం ఇండెక్స్ 0.97 శాతం, ఐటీ 0.17 శాతం, పవర్ 0.14 శాతం లాభాలతో ఉండగా.. రియాలిటీ 1.45 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.14 శాతం, ఎనర్జీ 1.12 శాతం, బ్యాంక్ నిఫ్టీ 0.88 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.72 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.72 శాతం, ఆటో 0.66 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 6 స్టాక్స్ లాభాలతో, 24 స్టాక్ట్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్ 0.77 శాతం, కొటక్ బ్యాంక్ 0.75 శాతం, టీసీఎస్ 0.34 శాతం, ఎయిర్ టెల్ 0.14 శాతం, టైటాన్ 0.12 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : ఎటర్నల్ 1.89 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.59 శాతం, ఎస్ బీఐ 1.44 శాతం, ట్రెంట్ 1.42 శాతం, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ 1.36 శాతం నష్టంతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Gold Price Today | అతివ‌ల‌కి అదిరిపోయే న్యూస్‌.. పసిడి ధరలకు బ్రేక్.. తగ్గిన బంగారం, వెండి ధరలు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

BJP Leadership Selection|బెంగాల్, అస్సాం బీజేపీ పగ్గాలు ఎవరికి? రంగంలోకి అమిత్ షా, నడ్డా!

అక్షరటుడే వెబ్‌డెస్క్:BJP Leadership Selection| పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో...

Biopesticides Usage | పంటలకు బయోపెస్టిసైడ్స్‌ వాడాలి

అక్షరటుడే, మెండోరా: Biopesticides Usage | పంటలకు పురుగు మందులను అవసరమైన...

Stock Market Today | పశ్చిమాసియాలో పెరుగుతున్న టెన్షన్స్.. నష్టాల్లో ముగిసిన సూచీలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Today | పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు...

Konda Surekha Comments | పుష్కరాలకు ఏపీకి కోట్లు.. తెలంగాణకు సున్నా.. కేంద్రం వివక్షపై సురేఖ ఆగ్రహం!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Konda Surekha Comments| ప్రధాని మోదీ పర్యటనలు, బీజేపీ రాజకీయాలపై...