Stock Market Today | ఒడిదుడుకుల్లో మార్కెట్లు.. నష్టాల్లో సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం స్వల్ప ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. ఉదయం 11.25 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 238 పాయింట్లు, నిఫ్టీ 64 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Today | దేశీయ మార్కెట్‌లో బ్యాంకింగ్ రంగ షేర్లలో లాభాల స్వీకరణ కొనసాగుతోంది. ఐటీ కంపెనీలూ ఒత్తిడికి గురవుతున్నాయి. హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్ వంటి హెవీ వెయిట్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో ప్రధాన సూచీలు నష్టాల బాటలో సాగుతున్నాయి.

Stock Market Today | నష్టాలతో ప్రారంభం..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 59 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 104 పాయింట్లు పెరిగింది. అయితే ఇంట్రాడే గరిష్టాల వద్ద నిలదొక్కుకోలేక 340 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 46 పాయింట్లు పెరిగినా.. తిరిగి అమ్మకాల ఒత్తిడితో 99 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 11.25 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 238 పాయింట్ల నష్టంతో 77,469 వద్ద, నిఫ్టీ 64 పాయింట్ల నష్టంతో 24,174 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 14 స్టాక్స్ లాభాలతో, 16 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ 1.22 శాతం, ఇండిగో 1.04 శాతం, టెక్ మహీంద్రా 0.71 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.63 శాతం, టైటాన్ 0.56 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : హెచ్డీఎఫ్ సీ బ్యాంక్ 1.40 శాతం, టీసీఎస్ 1.12 శాతం, మారుతి 1.05 శాతం, ఇన్ఫోసిస్ 0.99 శాతం, టాటా స్టీల్ 0.80 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: SBI Funds IPO | నిరాశపరిచిన ‘ఎస్‌బీఐ ఫండ్స్’.. స్వల్ప లాభాలతో లిస్టింగ్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *