బిజినెస్​Stock Market Loss | మళ్లీ నష్టాలు.. రూ. 5 లక్షల కోట్ల సంపద ఆవిరి

Stock Market Loss | మళ్లీ నష్టాలు.. రూ. 5 లక్షల కోట్ల సంపద ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ నష్టాల బాటపట్టింది. సెన్సెక్స్ 582 పాయింట్లు, నిఫ్టీ 180 పాయింట్లు కోల్పోయాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Loss | అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో ముడి చమురు ధరలకు రెక్కలు వస్తున్నాయి. దీనికితోడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు పెట్టుబడులు ఉపసంహరిస్తూనే ఉండడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. దీనికి తోడు గ్లోబల్ మార్కెట్లు (Global Markets) సైతం బలహీనంగా ఉండడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. యూఎస్ ఫెడ్ చైర్ జెరోమ్ పొవెల్ చేసిన కామెంట్లు సైతం మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి.

Stock Market Loss | నష్టాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ఉదయం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 482 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 756 పాయింట్లు నష్టపోయింది. అక్కడినుంచి కోలుకుని 996 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 181 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 200 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 291 పాయింట్లు ఎగబాకింది. చివరికి సెన్సెక్స్ 582 పాయింట్ల నష్టంతో 76,913 వద్ద, నిఫ్టీ 180 పాయింట్ల నష్టంతో 23,997 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Loss | ఐటీ మినహా..

నిఫ్టీలో ఐటీ, ఫార్మా, టెలికాం రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాల ఇండెక్స్‌లు నష్టాలతో ముగిశాయి. ఐటీ ఇండెక్స్ 0.37 శాతం, టెలికాం, ఫార్మా ఇండెక్స్‌లు 0.03 శాతం పెరిగాయి. మెటల్ ఇండెక్స్ 2.12 శాతం, రియాలిటీ 1.50 శాతం, ఎఫ్ ఎంసీజీ 1.35 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.08 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.01 శాతం నష్టపోయాయి.

Stock Market Loss | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,649 కంపెనీలు లాభపడగా 2,532 స్టాక్స్ నష్టపోయాయి. 156 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 106 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 26 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. బీఎస్ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 5 లక్షల కోట్లమేర ఆవిరయ్యింది.

Top gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 9 స్టాక్స్ లాభపడగా.. 21 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. సన్‌ఫార్మా 1.64 శాతం, ఇన్ఫోసిస్ 1.20 శాతం, అదానీపోర్ట్స్ 0.98 శాతం, టెక్ మహీంద్రా 0.95 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.72 శాతం లాభపడ్డాయి.

Top losers : ఎటర్నల్ 2.85 శాతం, హెచ్యూఎల్ 2.70 శాతం, టాటా స్టీల్ 2.13 శాతం, ఎల్ టీ 2.03 శాతం, ట్రెంట్ 1.97 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kamareddy Heat Wave | ‘రెడ్ జోన్’లో కామారెడ్డి జిల్లా.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Heat Wave | కామారెడ్డి (kamareddy) జిల్లాలో...

Amaravati Projects | ఏపీ క్యాబినెట్ భారీ నిర్ణయం.. రూ.1208 కోట్లతో క్వాంటం వ్యాలీ ట్విన్ టవర్ల నిర్మాణం!

అక్షరటుడే, అమరావతి: Amaravati Projects | ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM...

Maize Crop Fire | మొక్కజొన్న పంట దగ్ధం.. పరిశీలించిన ఎమ్మెల్యే

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Maize Crop Fire | మద్నూర్ మండలం (Madnur...

Bank Holidays in May | మేలో 9 రోజులు బ్యాంకులు బంద్!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bank Holidays in May | బ్యాంకులకు...