తెలంగాణFBO Caught by ACB | పోడు భూమి కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్...

FBO Caught by ACB | పోడు భూమి కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ బీట్​ ఆఫీసర్​

లంచం తీసుకుంటూ ఫారెస్ట్​ బీట్​ ఆఫీసర్​ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ఫారెస్ట్​ రేంజ్​ పరిధిలో చోటు చేసుకుంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : FBO Caught by ACB | అవినీతి అధికారులు మారడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు చేపడుతున్నా లంచాలు తీసుకోవడం ఆపడం లేదు. తాజాగా ఓ ఫారెస్ట్​ బీట్​ ఆఫీసర్​ (Forest Beat Officer) లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా గుండాల ఫారెస్ట్​ రేంజ్​ నదిమిగూడెం ఫారెస్ట్​ బీట్​ ఆఫీసర్​గా బానోత్​ నరేష్​ పని చేస్తున్నాడు. ఆయన సాయనపల్లి బీట్​కు ఇన్​ఛార్జీగా సైతం వ్యవహరిస్తున్నారు. వెంకటపురం గ్రామంలో ఓ వ్యక్తి తనకు ప్రభుత్వం గతంలో కేటాయించిన ఐదు ఎకరాల పోడు భూమి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే బీట్​ ఆఫీసర్​ నరేష్​ అతడిని వేధించేవాడు. పోడు భూమి సాగులో జోక్యం చేసుకోకుండా ఉండేందుకు లంచం ఇవ్వాలని డిమాండ్​ చేశాడు.

FBO Caught by ACB | కేసు నమోదు

బీట్​ ఆఫీసర్​ లంచం అడగడంతో రైతు కుమారుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గుండాలలోని తన కార్యాలయంలో బానోత్​ నరేష్​ గురువారం రూ.10 వేల లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు (ACB Officers) రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

FBO Caught by ACB | లంచం ఇవ్వొద్దు

ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలన ఇకోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్​9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

ఇది కూడా చదవండి..: Telangana Advisors | ‘సలహాదారుల’తో ఖజానాకు భారం.. అప్పుల రాష్ట్రంలో అదనపు ఖర్చు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kamareddy Heat Wave | ‘రెడ్ జోన్’లో కామారెడ్డి జిల్లా.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Heat Wave | కామారెడ్డి (kamareddy) జిల్లాలో...

Amaravati Projects | ఏపీ క్యాబినెట్ భారీ నిర్ణయం.. రూ.1208 కోట్లతో క్వాంటం వ్యాలీ ట్విన్ టవర్ల నిర్మాణం!

అక్షరటుడే, అమరావతి: Amaravati Projects | ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM...

Maize Crop Fire | మొక్కజొన్న పంట దగ్ధం.. పరిశీలించిన ఎమ్మెల్యే

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Maize Crop Fire | మద్నూర్ మండలం (Madnur...

Bank Holidays in May | మేలో 9 రోజులు బ్యాంకులు బంద్!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bank Holidays in May | బ్యాంకులకు...