అక్షరటుడే వెబ్డెస్క్: Telangana Congress Meetings | తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు , జిల్లాల వారీగా రాజకీయ సమీకరణాలపై అధిష్ఠానం దృష్టి సారించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ( Meenakshi Natarajan ), కీలక నేతలతో వరుసగా భేటీ అవుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Telangana Congress Meetings | మంత్రులతో మంతనాలు..
శుక్రవారం ఉదయం నుంచే మీనాక్షి నటరాజన్ బిజీగా గడిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి , జూపల్లి కృష్ణరావు తదితరులు ఆమెతో సమావేశమై, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు , ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ అమలు తీరుపై చర్చించినట్లు సమాచారం.
Telangana Congress Meetings | అంతర్గత విభేదాల పరిష్కారమే లక్ష్యం..
గత కొంతకాలంగా పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు సంస్థకు నష్టం కలిగిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా డీసీసీ సమావేశాల్లో మంత్రుల పనితీరుపై జిల్లా స్థాయి నేతలు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో.. పార్టీలో సమన్వయం సాధించడం, జిల్లాల వారీగా సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంపై అధిష్ఠానం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ కీలక చర్చల కోసం మీనాక్షి నటరాజన్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 మంది సీనియర్ నేతలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. పార్టీ బలోపేతం దిశగా అధిష్ఠానం తీసుకుంటున్న ఈ చర్యలు, మున్ముందు ఏ విధమైన మార్పులకు దారితీస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: Headmaster Suspended | ఉపాధ్యాయుల మధ్య గొడవ.. విద్యార్థులకు టీసీలు ఇచ్చిన హెచ్ఎం