Komidi Narsimha Reddy | భువనగిరి మాజీ ఎమ్మెల్యే మృతి

భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Komidi Narsimha Reddy | భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి (83) మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్​ (Hyderabad)లోని నిమ్స్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

నర్సింహారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1969 ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రజా చైతన్య వేదికను స్థాపించారు. గోదావరి జలాల సాధన కోసం, , మూసీ పరిరక్షణ ఉద్యమించారు. ఆయన అంత్యక్రియలు బుధవారం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నర్సింహారెడ్డి మృతితో భువనగిరి నియోజకవర్గంతో పాటు యాదాద్రి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మాజీ సీఎం చెన్నారెడ్డి అనుచరునిగా ఆయన కొనసాగారు.

Komidi Narsimha Reddy | సీఎం సంతాపం

Komidi Narsimha Reddy

భువనగిరి మాజీ ఎమ్మెల్యే నర్సింహా రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నర్సింహారెడ్డి తుదిశ్వాస వరకు నీతినిజాయితీతో జీవించారని కొనియాడారు. భూదానోద్యమానికి తన 300 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప మానవతావాదిగా స్మరించుకున్నారు. 1978, 1983 సంవత్సరాల్లో రెండుసార్లు భువనగిరి నుంచి శాసనసభకు ప్రాతినిథ్యం వహించారని పేర్కొన్నారు. నిరాడంబర జీవితాన్ని గడుపుతూ, అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాడిన నర్సింహారెడ్డి నేటి తరానికి ఆదర్శప్రాయుడని కొనియాడారు.

ఇది కూడా చదవండి..: Station Ghanpur Councilor | మహిళ ఇంట్లోకి నగ్నంగా చొరబడ్డ కౌన్సిలర్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *