అక్షరటుడే, వెబ్‌డెస్క్: Station Ghanpur Councilor | ప్రజాప్రతినిధిగా ప్రజలు సమస్యలు పరిష్కరించాల్సిన ఓ వ్యక్తి.. అర్ధరాత్రి ఓ మహిళ ఇంట్లోకి నగ్నంగా వెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటన జనగామ జిల్లా (Jangaon District) స్టేషన్ ఘనపూర్ మండలం చాగల్లులో చోటు చేసుకుంది.
చాగల్లు గ్రామం మున్సిపాలిటీలో విలీనం అయింది. వార్డ్ కౌన్సిలర్ సంపత్ రాజ్ సోమవారం అర్ధరాత్రి ఒంటిపై నులు పోగు లేకుండా స్థానికంగా ఉండే ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
Station Ghanpur Councilor | బాత్రూమ్లో బంధించి..
నిద్రిస్తున్న వృద్ధురాలిపై అత్యాచారం చేయడానికి సంపత్‌రాజ్ యత్నించాడు. దీంతో భయాందోళనకు గురైన ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు, కుటుంబ సభ్యులు అక్కడకు వచ్చారు. అందరిని చూసి భయపడిన నిందితుడు బాత్రూమ్లోకి వెళ్లాడు. వెంటనే స్థానికులు బయట నుంచి గడియ పెట్టారు. అనంతరం స్టేషన్ ఘన్పూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కౌన్సిలర్ సంపత్‌రాజ్‌ను అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: DSP Bheem Reddy | డీఎస్పీ భీమ్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్