DSP Bheem Reddy | డీఎస్పీ భీమ్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్​రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: DSP Bheem Reddy | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్​రెడ్డిని ఏసీబీ అధికారులు సోమవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది.

భారీగా అక్రమాస్తుల సంపాదించారని సమాచారం రావడంతో డీఎస్పీ భీమ్​రెడ్డి ఇంటితో పాటు 15 ప్రాంతాల్లో ఇటీవల ఏసీబీ అధికారులు (ACB Officers) సోదాలు చేశారు. హైదరాబాద్ (Hyderabad), సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పని చేసిన భీం రెడ్డి భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం ఆయన డీజీపీ ఆఫీస్‌లోని కంప్యూటర్‌ సర్వీసెస్‌లో పని చేస్తున్నారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.300 కోట్ల విలువైన ఆదాయానికి మించిన అక్రమాస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. సోదాల్లో లభించిన ఆధారాలు, పత్రాల పరిశీలన అనంతరం భీమ్‌రెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారు.

DSP Bheem Reddy | చంచల్​గూడ జైలుకు తరలింపు

భీమ్​రెడ్డిని ఏసీబీ అధికారుల ప్రత్యేక కోర్టులో హాజరు పర్చారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ తీర్పు ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను ఏసీబీ అధికారులు భద్రత మధ్య చంచల్‌గూడ జైలుకి తరలించారు. అక్రమాస్తుల విషయంలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు అధికారులు ఆయనను కస్టడీలోకి తీసుకోనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి..: Telangana Light Rain | పలు జిల్లాలకు తేలికపాటి వర్ష సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *