Weather Update | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Update | రాష్ట్రంలో అకాల వర్షాలు (Unseasonal Rains) అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వానలతో వాతావరణం చల్లబడి ఉక్కపోత నుంచి ఉపశమనం లభించినా.. పంటలు తడిసి రైతులు (Farmers) నష్టపోతున్నారు. నేడు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం వేళ ఒక్కసారిగా వాన దంచికొడుతుండటంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మొన్నటి వరకు ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు వానలతో కాస్త ఉపశమనం పొందారు.

Weather Update

Weather Update | ఈ జిల్లాల్లో

తెలంగాణ (Telangana)లోని ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​, నిర్మల్​, నిజామాబాద్​, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వర్షాలు పడే ఛాన్స్​ ఉంది. మెదక్​, సంగారెడ్డి, వికారాబాద్​, సిద్దిపేట, జనగామ, రంగారెడ్డి, మహబూబాబాద్​ జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు పడుతాయి. హైదరాబాద్​ నగరంలో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. సాయంత్రం సమయంలో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: Revanth vs KCR | ఒకే గడ్డ.. ఇద్దరు అగ్రనేతలు.. కరీంనగర్‌లో హీటెక్కిన పొలిటికల్ వార్!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *