జాతీయంTamil Nadu Election | తమిళనాడులో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

Tamil Nadu Election | తమిళనాడులో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ నెల 23న పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Tamil Nadu Election | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ నెల 23న పోలింగ్​ జరగనుంది. దీంతో అన్ని పార్టీలు చివరి రోజు జోరుగా ప్రచారం చేయనున్నాయి.

తమిళనాడు (Tamil Nadu)లో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒకే విడతలో పోలింగ్​ జరగనుంది. అధికార డీఎంకే, అన్నాడీఎంకే మధ్య హోరాహోరీగా పోరు సాగనుంది. సినీ నటుడు విజయ్​ (Vijay) పార్టీ టీవీకే పలు స్థానాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఈ పార్టీ ఎవరి ఓట్లను చీలుస్తుందో చూడాలి. అన్ని పార్టీలో ఇన్ని రోజులు ముమ్మరంగా ప్రచారం చేశాయి. ఎలాగైన అధికారంలోకి రావాలని ఏఐడీఎం (AIDM)కే ప్రయత్నిస్తుండగా.. అధికారాన్ని కాపాడుకోవాలని డీఎంకే చూస్తోంది. దీంతో అన్ని పార్టీలో ఓటర్లపై వరాలు జల్లులు కురిపించాయి. ఇన్ని రోజులు జోరుగా సాగిన ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది.

Tamil Nadu Election | డీఎంకేకు ఎంఐఎం మద్దతు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నిక (Tamil Nadu Assembly Election)ల్లో ఎంఐంఎం పార్టీ సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమికి మద్దతు తెలిపింది. ఈ మేరకు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వీడియో విడుదల చేశారు. ఏప్రిల్ 23న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ DMK అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. కాగా తమిళనాడులో కొన్ని నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్నారు. అయితే అక్కడ ఎంఐఎంకు పట్టు లేదు. దీంతో డీఎంకేకు ఆ పార్టీ మద్దతు తెలిపింది.

Tamil Nadu Election

Tamil Nadu Election | బెంగాల్​లో..

పశ్చిమ బెంగాల్​ (West Bengal)లో తొలి విడత ప్రచారం నేటితో ముగియనుంది. ఏప్రిల్ 23న 152 సీట్లకు తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. 29న 142 నియోజకవర్గాల్లో రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. మమతా బెనర్జీ దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు బెంగాల్​లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రధాని మోదీ (Prime Minister Modi), అమిత్​ షా (Amit Shah) సహా కీలక నేతలు ప్రచారం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Pharma Reactor Explosion | గడ్డపోతారం పారిశ్రామికవాడలో పేలుడు..

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....