అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CBI Bribery Case | భారీ అవినీతి తిమింగలాలను సీబీఐ (CBI) అరెస్ట్ చేసింది. ఏకంగా రూ.40 లక్షలు లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులు, ఓ ప్రైవేట్ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
మహారాష్ట్రలోని రాయ్‌గడ్ (Raygadh) జిల్లాలో సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (CGST) అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న ఒక IRS అధికారిని, రాయ్‌గడ్ CGST సూపరింటెండెంట్‌ను, మరో ప్రైవేట్ వ్యక్తిని, లంచం కేసులో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఫిర్యాదుదారునికి చెందిన క్వారీ సంస్థకు సంబంధించిన జీఎస్టీ/రాయల్టీ వ్యవహారాన్ని పరిష్కరించడం కోసం, నిందితుడైన సీజీఎస్టీ సూపరింటెండెంట్ రూ.1.50 కోట్ల లంచం డిమాండ్ చేశారు. చర్చల అనంతరం ఆ మొత్తాన్ని రూ.40 లక్షలకు తగ్గించారు.
CBI Bribery Case | నగదు, ఆభరణాలు లభ్యం
నిందితులు ఒక ప్రైవేట్ వ్యక్తి ద్వారా లంచం వసూలు చేస్తుండగా.. సీబీఐ అధికారులు వల పన్ని పట్టుకున్ఆనరు. అనంతరం ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, సంబంధిత న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. వారి నివాసాల్లో జరిపిన సోదాల్లో రూ. 43 లక్షల నగదు, సుమారు రూ. 90 లక్షల విలువైన ఆభరణాలు లభ్యం అయ్యాయని అధికారులు తెలిపారు.
దీనిని కూడా చదవండి : Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్ లక్కీడ్రా ప్రారంభం