Pharma Reactor Explosion | గడ్డపోతారం పారిశ్రామికవాడలో పేలుడు..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pharma Reactor Explosion | సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గడ్డపోతారం పారిశ్రామికవాడలోని ఎరిత్రో ఫార్మా (Erythro Pharma)లో రియాక్టర్‌ పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.

ఎరిత్రో ఫార్మా పరిశ్రమలో సోమవారం ఒక్కసారిగా రియాక్టర్​ పేలింది. పేలుడు ధాటికి సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమ చుట్టు పక్కల దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి వేశారు. ఈ ఘటనతో పరిశ్రమలోని కార్మికులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే ఈ ప్రమాదంలో ఎవరైన గాయపడ్డారా అనే వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Pharma Reactor Explosion | రాజస్థాన్​లో..

rajasthan

రాజస్థాన్‌ (Rajasthan)లోని బలోత్రా రిఫైనరీలో పేలుడు సంభవించింది. . రిఫైనరీలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో 20 ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. దీనిని మంగళవారం ప్రధాని మోదీ (PM Modi) ప్రారంభించడానికి సిద్ధం చేశారు. ఈ క్రమంలో ప్రమాదం జరగడం గమనార్హం.

Pharma Reactor Explosion | కార్మికుల ఆందోళన

తెలంగాణలోని పారిశ్రామికవాడల్లో ఇటీవల అగ్ని ప్రమాదాలు, రియాక్టర్​ బ్లాస్ట్​ ఘటనలతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు సైతం భయపడుతున్నారు. పరిశ్రమల యాజమాన్యం నిబంధనలు పాటించకపోవడంతోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో రియాక్టర్​ పేలి 50 మందికి పైగా చనిపోయారు. అనంతరం అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. అయినా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదు.

దీనిని కూడా చదవండి : Netflix Subscription Price | సబ్‌స్క్రిప్షన్ రేట్లతో షాక్ ఇస్తున్న నెట్‌ఫ్లిక్స్.. భారత్‌లోనూ పెంచే అవ‌కాశాలు?

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *