Medigadda Barrage | మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Medigadda Barrage | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. సోమవారం ఆయన జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు.

ముఖ్యమంత్రి ముందుగా కాళేశ్వరం (Kaleshwaram) చేరుకున్నారు. అక్కడ ముక్తేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. రూ.198 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. స్వామిదర్శనం అనంతరం సీఎం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. బ్యారేజీ మరమ్మతు పనులపై అధికారులతో చర్చించారు. కుంగిన ఏడో బ్లాక్ వద్ద డ్రిల్లింగ్ పనులు పరిశీలించారు. ఏరియల్‌ వ్యూ ద్వారా మేడిగడ్డను పరిశీలించిన సీఎం, ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు.

medigadda

Medigadda Barrage | పునరుద్ధరణ పనులు

కాళేశ్వరం ప్రాజెక్ట్​ను బీఆర్​ఎస్​ (BRS) హయాంలో నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ప్రారంభించిన మూడేళ్లకే ప్రాజెక్ట్​లో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. దీంతో బ్యారేజీలో నీటిని నిల్వ చేయడం లేదు. గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలతో కాళేశ్వరం కుంగిందని కాంగ్రెస్ (Congress)​ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ప్రాజెక్ట్​ పునరుద్ధరణకు ఇటీవల ఆమోదం తెలిపింది. దీంతో వేగంగా పనులు సాగుతున్నాయి. తాజాగా సీఎం పనుల తీరును పరిశీలించారు. కాగా కాళేశ్వరంపై కాంగ్రెస్​ ప్రభుత్వం పీసీ ఘోష్​ కమిషన్​ వేసింది. ఈ కమిషన్​ నివేదికపై బుధవారం హైకోర్టు తీర్పు చెప్పనుంది. ఈ క్రమంలో సీఎం ప్రాజెక్ట్​ను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

దీనిని కూడా చదవండి : Harish Rao Delhi Tour | బీఆర్​ఎస్​లో ముసలం.. కాంగ్రెస్​ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *