అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Model District | కామారెడ్డి(Kamareddy) జిల్లాను రాష్ట్రంలోనే మోడల్‌గా నిలపాలని, ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో అధికారుల పనితీరు అభినందనీయమని ప్రత్యేక అధికారి బి. విజయేంద్ర అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి సమీక్షలో ఆమె మాట్లాడారు.
Kamareddy Model District | ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు..
కామారెడ్డిని రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిద్దేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని విజయేంద్ర దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల (Welfare Schemes) ఫలితాలు ప్రతి లబ్ధిదారునికి అందేలా చూడాలని, జిల్లాలో జరుగుతున్న మంచి కార్యక్రమాలు, విజయగాథలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని సూచించారు. 99 రోజుల ప్రణాళికలోని పనులను స్పష్టమైన కాలపరిమితో పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ తీసుకున్న చర్యలను ఆమె ప్రశంసించారు. గ్రామ స్థాయిలో రోడ్డు భద్రత కమిటీలు, అవగాహనతో ప్రమాదాలు తగ్గాయని తెలిపారు.
Kamareddy Model District | బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసి..
బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెంచాలని, వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆమె ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా సంక్షేమ హాస్టళ్లలో పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు తప్పనిసరి చేయాలన్నారు. విద్యార్థులను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు అవగాహన, ఫుడ్ సేఫ్టీ నిబంధనల కఠిన అమలుపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్.వి. గిరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : గాంధీభవన్‌లో ‘ప్రజలతో ముఖాముఖి’ కోసం ప్రత్యేక కమిటీ నియామకం