అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Drunk Driving | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలో పోలీసులు కట్టుదిట్టంగా తనిఖీలు చేస్తున్నప్పటికీ మందుబాబులు ఏమాత్రం తగ్గట్లేదు. వారం రోజుల్లో ఏకంగా 426కేసులు నమోదయ్యాయంటే ఏస్థాయిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారో తెలుస్తోంది.
Drunk Driving | రెండువారాల్లో 426 కేసులు..
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ ట్రాఫిక్, బోధన్(Bodhan), ఆర్మూర్(Armoor) పరిధిలో గడిచిన రెండు వారాల్లో పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 426 మంది పట్టుబడగా వారిని నిజామాబాద్, బోధన్, అర్మూర్ కోర్టుల్లో ప్రవేశపెట్టారు. ఇందులో 10 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించగా.. మిగిలిన వారికీ రూ.41,60,000 జరిమానా విధించినట్లు సీపీ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని సీపీ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: క్రికెట్ ఆడిన మాజీ మంత్రి గంగుల కమలాకర్