Panchayat Secretary | అబ్బాపూర్ పంచాయతీ సెక్రెటరీపై చర్యలు తీసుకోవాలని వినతి

అబ్బాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్​లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు.

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Panchayat Secretary | అబ్బాపూర్ (Abbapur village) గ్రామపంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్​లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణిలో(prajavani) కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు.

Panchayat Secretary | ఏడు నెలలుగా లెక్కల్లేవు..!

ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ శివప్రసాద్ తదితరులు మాట్లాడుతూ.. ఏడు నెలల క్రితం పంచాయతీ (gram panchayat) పాలకవర్గం ఏర్పడిందన్నారు.

అయితే అప్పటి నుంచి పంచాయతీ కార్యదర్శిగా ఉన్న సునీత.. జీపీకి సంబంధించిన లావాదేవీలు లెక్కలు ఏమాత్రం చూపించకుండా దాటవేస్తోందని ఆరోపించారు.

సమాచార హక్కు చట్టం ద్వారా తాము లెక్కలు అడితే తప్పుడు ఎంబీలు, బిల్లులు తయారు చేసి ఫోర్జరీ సంతకాలు చేసి చూపెట్టారన్నారు. ఇప్పటివరకు ఏడు నెలల కాలంలో రూ.లక్లల్లో అవినీతికి పాల్పడిందని వారు ఆరోపించారు.

ఏదైనా సర్టిఫికెట్ విషయంలో పంచాయతీకి వెళ్తే సెక్రెటరీ అందుబాటులో ఉండటం లేదని.. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

పంచాయతీ పాలకవర్గాన్ని మభ్యపెడుతూ.. లెక్కలు చూపకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జీపీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని.. నిధుల దుర్వినియోగంపై స్పెషలాఫీసర్​ను వేసి నిగ్గు తేల్చాలని వారు కలెక్టర్​ను కోరారు.

ఇది కూడా చదవండి: India Slovakia Partnership | భారత్–స్లోవేకియా సంబంధాలు సమగ్ర భాగస్వామ్య స్థాయికి: ప్రధాని మోడీ

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *