RTA Bus Inspections | ఆర్టీఏ అధికారుల ముమ్మర తనిఖీలు..

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్​: RTA Bus Inspections | జిల్లావ్యాప్తంగా ఆర్టీఏ అధికారులు బస్సుల తనిఖీలను ముమ్మరం చేశారు. ఫిట్​నెస్​ లేని బస్సులను సీజ్​ చేస్తున్నారు.

RTA Bus Inspections | ఆర్మూర్​ పట్టణంలో..

పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్​ రాహుల్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం పట్టణంలోని మామిడిపల్లి (Mamidipalli) చౌరస్తాలో స్కూల్ బస్సుల తనిఖీలు నిర్వహించారు. వాహనాల పత్రాలు, ఫిట్​నెస్​, డ్రైవర్ల లైసెన్సులను పరిశీలించారు. వాహనాలకు తప్పనిసరి ఫిట్​నెస్​ చేయించుకోవాలని, మద్యం సేవించి వాహనాలను నడపకూడదని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వాహనాలను సీజ్ చేసి మోటార్ వెహికల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంవీఐ రోహిత్ రెడ్డి, సిబ్బంది మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

RTA Bus Inspections

ఇది కూడా చదవండి..: Panchayat Secretary | అబ్బాపూర్ పంచాయతీ సెక్రెటరీపై చర్యలు తీసుకోవాలని వినతి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *