Seethakka Review Meeting | మంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలి

కామారెడ్డిలో మంత్రి సీతక్క పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Seethakka Review Meeting | కామారెడ్డిలో (Kamareddy) మంత్రి సీతక్క పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.

Seethakka Review Meeting | ఉమ్మడి నిజామాబాద్​.. కరీంనగర్​..

ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అధికారులతో నిర్వహించనున్న ఈ సమీక్షా సమావేశానికి సంబంధించి వేదిక ఏర్పాట్లు, శాఖల వారీగా నివేదికల సిద్ధం, సమావేశానికి అవసరమైన ఇతర ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి సమీక్షా సమావేశానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. శాఖల వారీగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, వాటి పురోగతి, పెండింగ్ అంశాలు, సాధించిన లక్ష్యాలు తదితర వివరాలతో సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు.

అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రూమ్ నంబర్ 25కు మార్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, జెడ్పీ సీఈఓ చందర్, డీఆర్‌డీఓ దామోదర్ రెడ్డి, డీఆర్ఓ పాండు, ఏఓ మసూద్ హైమద్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: బాక్సాఫీస్పై నాని దండయాత్ర..‘ప్యారడైజ్’కు ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్.. 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *