Pension Fraud Complaint | పింఛన్ ఇప్పిస్తామని డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలి

దళారులు పింఛన్ ఇప్పిస్తామని డబ్బులు అడిగితే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని ఛైర్​పర్సన్ ఇప్ప ఉమారాణి సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Pension Fraud Complaint | పేద ప్రజల వద్ద ఎవరైనా దళారులు పింఛన్ ఇప్పిస్తామని డబ్బులు అడిగితే మున్సిపల్ కార్యాలయం (Municipal Office)లో ఫిర్యాదు చేయాలని ఛైర్​పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.

Pension Fraud Complaint | పారదర్శకంగా ఎంపిక..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న చేయూత పింఛన్ల పథకాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది దళారులు, మధ్యవర్తులు పేద ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని ఆమె హెచ్చరించారు. అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసే సమయంలో దళారుల బారినపడి మోసపోవద్దని కోరారు. పింఛన్ల పంపిణీకి ఎలాంటి దళారులు అవసరం లేదని, కేవలం అర్హులైన వారికే పింఛన్ నేరుగా వారి ఖాతాలోకి జమ అవుతుందని, అధికారులు ఇంటికి వచ్చి ఆన్‌లైన్ ఫోటో వెరిఫికేషన్ చేస్తారని ఆమె స్పష్టం చేశారు. ఎవరైనా డబ్బులు ఆశిస్తే వారు ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లేనని, పేద ప్రజల పొట్టగొట్టి ప్రభుత్వ పథకాలతో వ్యాపారం చేసే ఏ దళారీని, మధ్యవర్తిని కూడా క్షమించబోమని, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఇది కూడా చదవండి..: State Level Softball Competitions | రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ముచ్కూర్ విద్యార్థిని ఎంపిక

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *