Congress Candidate Arrest | అభ్యర్థిని చంపినా నామినేషన్​ వెనక్కి తీసుకోం : కేసీ వేణుగోపాల్

నందిగ్రామ్​ కాంగ్రెస్​ అభ్యర్థి అరెస్ట్​పై కేసీ వేణుగోపాల్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Congress Candidate Arrest | పశ్చిమ బెంగాల్​లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వచ్చే నెల 6న రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరగున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

నందిగ్రామ్​ అసెంబ్లీ నియోజకవర్గానికి అక్టోబర్​ 6న ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానం నుంచి మమతా బెనర్జీ (Mamata Banerjee) అభ్యర్థిని ప్రకటించారు. అయితే అనుహ్యంగా ఆయన సీఎం సువేందు అధికారిని కలిసి, తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో మమతా కాంగ్రెస్​ అభ్యర్థికి మద్దతు తెలిపారు. అయితే ఆ అభ్యర్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిలన్ ప్రధాన్‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. నందిగ్రామ్ భూ పోరాటానికి సంబంధించి 12కు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రధాన్‌ను, తూర్పు మిద్నాపూర్ జిల్లాలోని చండీపూర్‌లో ఉన్న ఒక హోటల్ నుండి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Congress Candidate Arrest | ప్రజాస్వామ్య విరుద్ధం

కాంగ్రెస్ అభ్యర్థి అరెస్టుపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం స్పందింంచారు. బెంగాల్​లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్​ అభ్యర్థి నామినేషన్‌ను ఉపసంహరించుకోరని స్పష్టం చేశారు. అరెస్ట్​కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతామని పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో నందిగ్రామ్ ఒక చీకటి అధ్యాయం అని అభివర్ణించారు. అభ్యర్థిని చంపేసినా సరే, నామినేషన్ ఉపసంహరించుకోరు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేస్తారని స్పష్టం చేశారు. బీజేపీ అనుసరిస్తున్న నియంతృత్వ రాజకీయాలకు ముగింపు పలికే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు పోరాటం చేస్తారన్నారు.

ఇది కూడా చదవండి..: PM Modi Carbon Emissions | కార్బన్​ ఉద్గారాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *