Mamata Banerjee | మమతా బెనర్జీకి మరో షాక్​

మమతా బెనర్జీకి మరో షాక్​ తగిలింది. ఉప ఎన్నికల్లో ఆమె ప్రకటించిన ఇద్దరు అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mamata Banerjee | బెంగాల్​ మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో షాక్​ తగిలింది. ఇప్పటికే ఆమె పార్టీ రెండుగా చీలిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఉప ఎన్నికల్లో పోటీకి ఆమె నిలిపిన ఇద్దరు అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు.

బెంగాల్​లోని నందిగ్రామ్​, రెజినగర్​ అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్​ 6న ఉప ఎన్నిక జరగనుంది. అయితే ఇప్పటికే టీఎంసీ రెండుగా చీలిపోవడంతో ఎన్నికల సంఘం (Election Commission) ఇరు వర్గాలకు వేర్వేరు గుర్తులు, పేర్లు కేటాయించింది. మమతా బెనర్జీ వర్గానికి మమతా ఆల్​ ఇండియా తృణమూల్​ కాంగ్రెస్​ పేరు, ఫుట్​బాల్ ప్లేయర్​ గుర్తు కేటాయించింది. దీంతో ఆమె రెండు స్థానాల నుంచి ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

Mamata Banerjee | తప్పుకున్న ఇద్దరు

మమతా బెనర్జీ వర్గానికి చెందిన నందిగ్రామ్ అభ్యర్థి సంచితా ప్రధాన్ డే శుక్రవారం సీఎం సువేందు అధికారిని కలిశారు. అనంతరం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. రెజినగర్ అభ్యర్థి కూడా అదే బాట పట్టారు. శనివారం మమతా బెనర్జీ పార్టీ అభ్యర్థి రబియుల్ ఆలం చౌదరి పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో రెండు స్థానాల్లో మమత వర్గంలో పోటీలో లేకుండా పోయింది. కాగా నందిగ్రామ్​లో కాంగ్రెస్​కు మద్దతు తెలిపిన మమత, రెజినగర్​లో కూడా అదే చేసే అవకాశం ఉంది.

Mamata Banerjee | ఓటమి తర్వాత..

మమతా బెనర్జీ 15 ఏళ్ల పాటు బెంగాల్​ను పాలించారు. కమ్యూనిస్ట్ కంచుకోటలను బద్దలు కొట్టి తొలిసారి 2011లో అధికారంలోకి వచ్చిన ఆమె మూడు సార్లు సీఎంగా పని చేశారు. అయితే టీఎంసీపై వ్యతిరేకత, కార్యకర్తలు, నాయకుల అరాచకలతో ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారు. ఒక్క ఓటమితో తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ పని అయిపోయింది. పార్టీ రెండు చిలీపోయింది. ఆ పార్టీలోని ఎంపీలు ఎన్​సీపీఐలో విలీనం అయ్యారు. మొన్నటి వరకు అధికారంలో ఉన్న మమతకు ఇప్పుడు పోటీ చేయడానికి అభ్యర్థులు లేకుండా పోయారు.

ఇది కూడా చదవండి..: Congress Candidate Arrest | అభ్యర్థిని చంపినా నామినేషన్​ వెనక్కి తీసుకోం : కేసీ వేణుగోపాల్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *