అక్షరటుడే, భీమ్‌గల్: Illegal Building Demolition | భీమ్‌గల్ (Bheemgal) పురపాలక సంఘం పరిధిలో అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ డి.గజానంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.
Illegal Building Demolition | ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి..
నూతనంగా గృహాలు, వ్యాపార సముదాయాలు (మడిగెలు) నిర్మించాలనుకునే వారు తప్పనిసరిగా ఆన్‌లైన్ విధానంలో మున్సిపల్ అనుమతి పొందాలని కమిషనర్ తెలిపారు.
అనుమతి పత్రాలు వచ్చిన తర్వాత మాత్రమే నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. మున్సిపల్ అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా యజమానులకు నోటీసులు జారీ చేయడంతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపడతామని హెచ్చరించారు. పట్టణవాసులు ఈ విషయాన్ని గమనించి, మున్సిపల్ అనుమతులు తీసుకున్న తరవాతే పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి..: Pension Fraud Complaint | పింఛన్ ఇప్పిస్తామని డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలి